breaking news
mohammad akhlaq
-
మోదీ పాలనలో గోరక్షణ హత్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో మూక హత్యలు ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా గోరక్షణ పేరిట, గోవులను హత్య చేశారనో, గోవులను అక్రమంగా తరలిస్తున్నారనో దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లరి మూకలు ఈ హత్యలకు పాల్పడ్డాయి. వీటిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాలకపక్ష బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు కొన్ని సామాజిక బృందాలు కూడా సమర్థించాయి. ఈ హత్యలను ప్రోత్సహించడంలో సామాజిక మీడియా ప్రధాన పాత్ర పోషించింది. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి అనే చిన్న పట్టణంలో 2015. సెప్టెంబర్ 28వ తేదీన తొలి మూక హత్య జరిగింది. మొహమ్మద్ అఖ్లాక్ ఇంట్లో లేగదూడను హత్య చేశారనే వార్త ప్రచారం కావడంతో స్థానిక గుడి వద్ద ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు సమావేశమయ్యారు. వారంతా వెళ్లి అఖ్లాక్ ఇంటిపై దాడి జరిపారు. ఆ ఇంటి ఫ్రిజ్‌లో భద్రపర్చిన మాంసాన్ని అవు మాంసంగా అనుమానించారు. అది మేక మాంసం అంటూ ఇంట్లోని ఆడవాళ్లు చెబుతున్న వినకుండా అఖ్లాక్, ఆయన కుమారుడు డానిష్‌ను చితకబాదారు. ఆ దాడిలో అఖ్లాక్ చనిపోగా, తీవ్రంగా గాయపడిన డానిష్‌కు ఏడాది తర్వాత మెదడుకు ఆపరేషన్ జరిగింది. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన రవి సిసోడియా ఏడాది తర్వాత మూత్రపిండాల వ్యాధితో చనిపోయారు. అప్పుడు కేంద్ర మంత్రి మహేశ్ శర్మ, రవి సిసోడియా భౌతిక దేహాన్ని సందర్శించి, ముఖిలిత హస్తాలతో నివాళి అర్పించడంతోపాటు దేశం కోసం మరణించిన వీరుడిలా ఆయన భౌతికకాయంపై జాతీయ జెండాను కప్పి గౌరవించారు. అంతకుముందు ఇదే మంత్రి దాద్రి సంఘటనను ఓ ‘యాక్సిడెంట్’గా అభివర్ణించారు. ఈ కేసులో అరెస్టయిన వారంతా ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్నారు. ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. మొహమ్మద్ అఖ్లాక్ కుటుంబీకుల ఆక్రందన 2016, మార్చి నెలలో జార్ఖండ్‌లో పశువుల వ్యాపారులంటూ ఇద్దరిని కొట్టి చంపి, వారి శవాలను ఓ చెట్టుకు వేలాడదీశారు. 2016, జూలైలో గుజరాత్‌లోని ఉనాలో చనిపోయిన ఆవుల చర్మాలను ఒలుస్తున్న నలుగురు దళితులను గోరక్షకులు పట్టుకొని చితకబాదారు. వారే దళితులను చితకబాదుతున్న దృశ్యాలను వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2017లో రాజస్థాన్ పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ ఆరుగురు చితక్కొట్టి వీడియోతీసి సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేశారు. పెహ్లూ ఖాన్ తన మరణ వాంగ్మూలంలో ఆరుగురు నిందితుల పేర్లను వెల్లడించినప్పటికీ పోలీసులు వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. 2018లో కూడా ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో గోరక్షణ పేరిట ఓ మూక హత్య జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. పిల్లల దొంగల పేరిట మూక హత్యలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దొంగలు పిల్లల్ని ఎత్తుకు పోతున్నారంటూ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన వదంతుల వల్ల కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో మూక హత్యలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో 14 ఏళ్ల బాలికను ఎత్తుకుపోయారన్న వార్తతో 2017, జూన్ 27వ తేదీన మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ యువతిని కొట్టి చంపారు. 2018, జూన్ నెలలో అస్సాంలో పిల్లల దొంగలన్న అనుమానంతో ఇద్దరు యువకులను కొట్టి చంపారు. బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన హిందీ మాట్లాడే దొంగలు పిల్లలను ఎత్తుకుపోతున్నారనే ప్రచారం జరగడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు దాడులు జరిగాయి. రెండు నెలల తర్వాత మహారాష్ట్రలో సంచార తెగకు చెందిన నలుగురు యువకులను కొట్టి చంపారు. 117 గోరక్షణ దాడులు 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేశంలో గోరక్షణ పేరిట 117 దాడులు జరిగాయని ‘ఇండియా స్పెండ్’ గణాంకాలు తెలియజేస్తుండగా, ఇదే కాలంలో జరిగిన మూక హత్యల్లో 88 మంది మరణించారని ‘క్వింట్’ లెక్కలు చెబుతున్నాయి. గోరక్షణ చర్యలు, దాడుల వల్ల ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. ముఖ్యంగా ఇతర దేశాలకు గోమాంసం, చర్మాల ఎగుమతి నిలిచిపోయింది. కొనేవారులేక ముసలి, ముతక గోవులను వదిలేస్తే అవి రైతుల పొలాలను మేస్తున్నాయి. దూరంగా వదిలేస్తే అధికారులు వచ్చి రైతులపై ‘కల్పబుల్ హోమిసైడ్’గా పోలీసులు కేసులు పెడుతున్నారు. ఈ సంఘటనలపై 2017లో మొదటిసారి నోరు విప్పిన ప్రధాని నరేంద్ర మోదీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. -
దాద్రి నిందితుడు జైలులో మృత్యువాత
-
దాద్రి నిందితుడు జైలులో మృత్యువాత
నోయిడా: దేశంలో సంచలనం సృష్టించిన దాద్రి ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒక యువకుడు చనిపోయాడు. ప్రస్తుతం జైలులోనే ఉన్న అతడు మృత్యువాత పడ్డాడు. డెంగ్యూ లేదా చికెన్ గునియావంటి వ్యాధుల కారణంగా అతడు చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతుండగా తమ కుమారుడిని పోలీసులే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో ఇంట్లో గోమాంసం ఉందని, గోహత్యకు పాల్పడ్డాడని మహ్మద్ అక్లాక్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 15మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో బిసదా ప్రాంతానికి చెందిన రవీణ్ 22 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. అతడిని గ్రేటర్ నోయిడాలోని లుక్సార్ జైలులో వేశారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ యువకుడు చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. పలు ఆస్పత్రులకు తిప్పినా అతడు కోలుకోలేదని అన్నారు. -
అవును.. అది ఆవు మాంసమే!
దేశంలో 'అసహనం' వ్యాఖ్యలకు దారితీసిన దాద్రి ఘటన గుర్తుండే ఉంటుంది కదూ. యూపీలోని దాద్రి ప్రాంతంలో 50 ఏళ్ల మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి వద్ద ఆవుమాంసం ఉందని సుమారు 100 మంది అతడిని ఇంట్లోంచి బయటకు లాగి చంపేశారు. అప్పట్లో పోలీసులు అతడి ఇంటివద్ద చెత్తకుండీలో ఉన్న మాంసం శాంపిళ్లను సేకరించారు. అది 'మటన్' అని, బీఫ్ కాదని స్థానిక వైద్యుడు ఒకరు చెప్పారు. కానీ.. ఆ ఘటన జరిగిన 8 నెలల తర్వాత ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. అక్కడ లభించింది. ఆవు లేదా దూడ మాంసమేనని ఫోరెన్సిక్ పరీక్షలో వెల్లడైంది. తొలుత అది మటన్ అనే తాము భావించామని, కానీ తర్వాత అది ఆవుమాంసం అన్న విషయం తేలిందని యూపీ డీజీపీ జావేద్ అహ్మద్ తెలిపారు. యూపీలో ఆవుమాంసం తినడం నేరం కాదు గానీ, ఆవులను చంపడం మాత్రం నేరమే. అఖ్లాక్ హత్య కేసులో అరెస్టయిన 18 మందిలో స్థానిక బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. అప్పట్లో ముందు అక్కడున్నది మటన్ అని చెప్పడంతో.. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు తప్పుడు రూమర్లు ప్రచారం చేస్తూ మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది.