రాష్ట్ర విభజన దిశగానే కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తోందని మంత్రులతో సీఎం కిరణ్ చెప్పినట్టు తెలిసింది. క్యాంపు కార్యాలయంలో సీఎంను పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీ పరిణామాలపై సీఎం కిరణ్ విచారం వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా తన చేతులమీదుగా రాష్ట్ర విభజన వద్దని అధిష్టానానికి స్పష్టం చేశానని, అవసరమైతే సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పినట్టు మంత్రులకు తెలిపారని తెలుస్తోంది. విభజన పాపం తాను మూటగట్టుకోలేనని హైకమాండ్కు సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం.
Jul 28 2013 2:19 PM | Updated on Mar 20 2024 5:20 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement