పెద్ద నోట్ల రద్దుపై జరిగిన హర్తాళ్ కు ప్రజలు మద్దతు ప్రకటించారని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలు, అరెస్టులు చేయిందని విమర్శించారు.