నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీ వర్గీయులు సృష్టిస్తున్న బోగస్ ఓట్ల అంశంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ స్పందించారు. ఇప్పటివరకూ నాలుగు వేల బోగస్ ఓట్లను తొలగించినట్లు తెలిపారు. అనంతపురంలో నేడు ఇంటర్ విద్యార్థులతో ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాల ఓటర్ల జాబితాను డబుల్ వెరిఫికేషన్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నంద్యాల నియోజకవర్గంతో సంబంధం లేని ఓట్లను తొలగిస్తున్నామని చెప్పారు.