తమిళులంతా జల్లికట్టు కావాలని ఒక్కతాటి మీదకు వచ్చి పోరాటం చేసిన స్ఫూర్తితో ముస్లింలు ట్రిపుల్ తలాక్ కోసం పోరాడాలని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. తమిళుల్లాగే ముస్లింలకు కూడా తమ సొంత సంస్కృతి ఒకటి ఉందని, తమిళుల ఉద్యమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తల వంచాల్సి వచ్చినందున ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. తమ పెళ్లిళ్లు, ట్రిపుల్ తలాక్ లాంటి తమ సంప్రదాయాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదని ఆయన అన్నారు.