అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు | AP in 24 Hours Heavy rains | Sakshi
Sakshi News home page

Sep 14 2016 9:40 AM | Updated on Mar 20 2024 3:12 PM

రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాలు బలోపేతం కావడం, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో పలుప్రాంతాల్లో రాకపోకలు స్తంభిం చాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురజాలలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి దండెవాగు ఉధృతంగా ప్రవహించి, రైల్వేస్టేషన్ సమీపంలో 100 మీటర్ల మేర ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో నడికుడి-మాచర్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement