టాలీవుడ్ హీరోయిన్ అంజలి మరోసారి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. పిన్ని భారతి, బాబాయ్ హరిబాబు తనను మానసికంగా వేధిస్తున్నారంటూ కోర్టుకెక్కింది. వారిద్దరిపై అంజలి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిన్ని, బాబాయ్పై తగిన చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని మొరపెట్టుకుంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు.. ఈ కేసును విచారించి, వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. గతంలో కూడా అంజలి పిన్ని భారతిపై ఆరోపణలు చేసింది. పిన్ని, డైరెక్టర్ కళంజియం నుంచి తనకు హాని ఉందని పేర్కొంది. తన ఆస్తులను దోచుకున్నారని, తనను ఏటీఎమ్ కార్డుల్లా వాడుకుంటారని వారిపై విమర్శలు చేసింది. అంజలి కోసం తాను 70 లక్షల రూపాయలు ఖర్చు చేశానని, తనకు ప్రతి నెలా 50 వేల రూపాయలు ఇచ్చేలా అంజలిని ఆదేశించాలని కోరుతూ భారతి చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత పిన్నికి దూరంగా ఉంటున్న అంజలి మరోసారి ఆమెపై ఫిర్యాదు చేసింది.
Nov 14 2013 7:27 AM | Updated on Mar 20 2024 3:19 PM
Advertisement
Advertisement
Advertisement
