తెలుగు విద్యార్థులపై నార్త్ ఇండియా విద్యార్థుల దాడి | 31-students-injured-in-clashes-at-visakhapatnam | Sakshi
Sakshi News home page

Jun 20 2015 11:49 AM | Updated on Mar 20 2024 3:53 PM

నగరంలోని మిథిలాపురంలోని ఓ ప్రైవేట్ ఇంటర్ కాలేజీలో తెలుగు విద్యార్థులపై శనివారం నార్త్ ఇండియా విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో 30 మంది తెలుగు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన విద్యార్థులను మధురవాడలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు కాలేజీ వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీకి చేరుకున్నారు. కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement