లక్కిరెడ్డిపల్లి : మండల కేంద్రమైన లక్కిరెడ్డిపల్లి చింతలకుంటవాళ్లపల్లి మార్గమధ్యలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పకీరమ్మ (68) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్‌ఐ గోల్కొండ శోభ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. కోనంపేట పంచాయతీలోని కాలాడివాళ్లపల్లికి చెందిన పకీరమ్మ ఉదయాన్నే ఉపాధి పనికి వెళ్లి వచ్చింది. మధ్యాహ్నం బ్యాంకులో అగ్రికల్చర్ సంబంధించిన పని పూర్తి చేసుకొని, కూరగాయలు తీసుకొని కాలాడివాళ్లపల్లెకు కాలినడకు వెళ్తుండగా కోనంపేట నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే రెండు కాళ్లు చేతులు విరిగిపోయి మృత్యువాత పడింది. ఈ మేరకు కార్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుండ్లగుట్ట తాండాలో
పిచ్చి కుక్క వీరంగం
మదనపల్లె టౌన్ : గుర్రంకొండ మండలంలో పిచ్చికుక్క వీరంగం సృష్టించి పలువురి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బుధవారం సాయంత్రం జరిగిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. గుర్రంకొండ మండలంలోని గుండ్ల గుట్ట తండా లోకి ఎక్కడి నుంచో ఒక పిచ్చికుక్క ఉన్నట్లుండి వచ్చింది. కనిపించిన వారిని కనిపించినట్లే కరచి తీవ్రంగా గాయపరిచింది.
పిచ్చికుక్క దాడి చేయడంతో గ్రామానికి చెందిన జయమ్మ (56), హరిత (28), నాగిరెడ్డి ( 37), తో పాటు మరో నలుగురు గాయపడడంతో వారిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నారు


