కడప ఎడ్యుకేషన్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఈనెల 3వ తేదీ నిర్వహించనున్న జాతీయస్థాయి ఆర్హత ప్రవేశ పరీక్ష(నీట్ యూజీ–2026)కు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 22952 మంది విద్యార్థులకు కడపలో 8, పొద్దుటూరులో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంబంధిత పరీక్షను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు ఉదయం 11 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. 11 నుంచి మధ్యాహ్నం 1.40 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తోపాటు బయోమెట్రిక్ తీసుకుంటారు. 1.30 తరువాత విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. 1.50కి బుక్‌లెట్‌ను అందజేస్తారు. 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది.
విద్యార్థులు తెచ్చుకోవాల్సినవి...
ప్రింటవుట్ అడ్మిట్‌కార్డు, నీట్ దరఖాస్తు సమయంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన పాస్‌పోర్టు సైజు ఫొటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరో పాస్‌పోర్టు సైజు ఫొటోను పరీక్ష కేంద్రంలో హాజరు నమోదు చేసే సమయంలో ఆటెండెన్స్ షీట్‌పై అతికించాలి. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డు, 12వ తరగతి అడ్మిషన్ కార్డులో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాన్ని వెంట తెచ్చుకోవాలి.
● కడపలోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను శనివారం నీట్ సిటీ కోఆర్డినేటర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ మునీష్‌మీనా, డిప్యూటీ సిటీ కో–ఆర్డినేటర్ మల్లికార్జునలు పరిశీలించారు.
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
కడప అర్బన్: నీట్ పరీక్షకు పటిష్ట పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామన్నారు.
పరీక్షా కేంద్రం హాజరయ్యే విద్యార్థులు
కడపలో...
ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ డిగ్రీ కళాశాల 360
గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల 360
మున్సిపల్ హైస్కూల్ మెయిన్ 360
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం 240
బీఆర్ అంబేడ్కర్ గురుకులం 240
వైఆర్‌జెడ్‌పీహెచ్ స్కూల్ గర్‌ల్స్ 240
గవర్నమెంట్ పాలిటెక్నికల్ ఫర్ ఉమెన్ 240
గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ 240
ప్రొద్దురూరులో...
వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల 384
ఏపీ ఎంపిల్ హైస్కూల్ మెయిన్ 288
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నీట్‌కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రదారణపై ఎన్‌టీఏ అంక్షలు విధించింది, విద్యార్థినులు ముక్కుపుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజులు సహా ఆభరణాలను ధరించరాదు,
చేతికి వాచీలు సైతం ధరించకూడదు,
విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు ధరించకుండా సాధారణ దుస్తుల్లోనే హాజరుకావాల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్లకు సన్‌గ్లాస్ ధరించకూడదు
బ్లూటూత్ వాచీలు, సెల్‌ఫోన్లు, పెన్నులు సహా ఇతర వస్తువులు వెంట తీసురాకూడదు,


