6న జిల్లాస్థాయి బాస్కెట్‌ బాల్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

6న జిల్లాస్థాయి బాస్కెట్‌ బాల్‌ ఎంపికలు

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

6న జిల్లాస్థాయి బాస్కెట్‌ బాల్‌ ఎంపికలు బాధ్యతల స్వీకరణ ప్రశాంతంగా పదోన్నతుల కౌన్సెలింగ్‌ డిజిటల్‌ అసిస్టెంట్లకు .. నూతన కార్యవర్గం ఎన్నిక

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: కడప జయనగర్‌ కాలనీలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 6న జిల్లాస్థాయి బాస్కెట్‌ బాల్‌ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సహదేవ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు 2010 జనవరి 1 తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులన్నారు. ఎంపికై న క్రీడాకారులు జూన్‌ మొదటి వారంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలల్లో పాల్గొంటారని తెలిపారు.

కడప అగ్రికల్చర్‌: కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) నూతన కో–ఆర్డినేటర్‌ (అధిపతి)గా డాక్టర్‌ శిల్పకళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న అంకయ్యకుమార్‌ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో శిల్పకళకు బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లా రైతులకు అధునిక వ్యవసాయ పద్దతులకు సంబంధించి శిక్షణలు అందిస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా పనిచేస్తానని తెలిపారు. డాక్టర్‌ శిల్పకళకు శాస్త్రవేత్తలు అభినందనలు తెలిపారు.

కడప ఎడ్యుకేషన్‌: ఇంటర్మియట్‌ విద్యలో భాగంగా నాన్‌ టిచింగ్‌ సిబ్బందికి శనివారం కడపలోని ఇంటర్‌ ఆర్‌జేడీ కార్యాలయంలో నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. కడప కర్నూల్‌, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించి నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి ఆర్‌జేడీ సురేష్‌కుమార్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆరుగురు రికార్డు అసిస్టెంట్ల నుంచి జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. కర్నూల్‌ జిల్లాలో ముగ్గురికి, అనంతపురం జిల్లాలో ఒకటిరికి, వైఎస్సార్‌కడప జిల్లాలో ఇద్దరికి పదోన్నతులు లబించాయి. కార్యక్రమంలో నాన్‌టిచింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరాజు, వైఎస్సార్‌కడప జిల్లా అధ్యక్షులు సురేష్‌, ఆర్‌జేడీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: డిజిటల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 30 మందికి పదోన్నతులకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను శనివారం జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకట సుబ్బయ్య నిర్వహించారు. వీరికి పంచాయతీ గ్రేడ్‌–5 సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించనున్నారు. రెండు, మూడు రోజుల్లో పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.

కడప కోటిరెడ్డిసర్కిల్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ (పీటీడీ) అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కడప జోనల్‌ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. జోనల్‌ కమిటీ అధ్యక్షుడిగా ఎంఎండీ హనీఫ్‌, ఉపాధ్యక్షులుగా ప్రభాకర్‌, జోనల్‌ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా విజయ్‌, జోనల్‌ కార్యదర్శిగా శివశంకర్‌, జోనల్‌ జాయింట్‌ సెక్రటరీగా సోమశేఖర్‌రెడ్డి, జోనల్‌ కార్యదర్శిగా పవన్‌కుమార్‌, జోనల్‌ ప్రచార కార్యదర్శిగా నరేష్‌, జోనల్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా ఎస్‌.శ్యామల, జోనల్‌ అసిస్టెంట్‌ కార్యదర్శిగా శరవణకుమార్‌, జోనల్‌ అసిస్టెంట్‌ కార్యదర్శిగా రాంబాబు ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఎంప్లాయిస్‌ యూనియన్‌ జోనల్‌ కార్యదర్శి ఎన్‌.రాజశేఖర్‌ అధ్యక్షతన కడప జోనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాఘవకుమార్‌ను కలిసి కార్మికుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాంజనేయులు, జిల్లా కార్యదర్శి స్టీఫెన్‌ ఆంటోని, చెప్పలయ్య, రాయుడు, నరసింహ, జిల్లా మహిళా నాయకురాలు ప్రభావతి, రజని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement