రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనలకు తెలుగుసాహిత్యంలో విశేషస్థానం ఉంటుందని రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. శనివారం అన్నమాచార్యుల జయంత్యుత్సవాల సందర్భంగా తాళ్లపాకలోని అన్నమయ్య విగ్రహమూర్తికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమాచార్యుని కీర్తనలు తెలుగుసంస్కృతికి ప్రతి రూపాలన్నారు. మహానేత వైఎస్సార్ పాలనలో అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకకు స్వర్ణయుగమనే చెప్పవచ్చునన్నారు. దివంగత సీఎం వెఎస్సార్ తాళ్లపాకను సందర్శించారన్నారు. అలాగే అన్నమయ్య వంశీకుల సంక్షేమానికి వైఎస్‌ఆర్ కృషి మరిచిపోలేనిదన్నారు. ఇప్పటికి ఆ సంప్రదాయం కొనసాగుతోందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్నమయ్య ఉద్యానవనంలో శ్రీవారి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. అలాగే టీటీడీ పాలకలమండలి తాళ్లపాకలో అన్నమయ్య ధాన్యమందిరం నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేశారన్నారు. 2029లో వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని, అందుకు ఆ దేవదేవుని ఆశీస్సులు తప్పక ఉంటాయన్నారు. రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు డీలరు సుబ్బరామిరెడ్డి, దండుగోపి, దాసరి పెంచలయ్య,, శేఖర్, తాళ్లపాకకు చెందిన గ్రామస్తులు ఉద్దండం సుబ్రమణ్యం తదితర పెద్దలు పాల్గొన్నారు
● తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. అనంతరం టీటీడీ వారు ఎమ్మెల్యేను సన్మానించారు.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి


