కడప ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉగ్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 6వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ వద్ద వైఎస్సాఆర్ టీచర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం వైఎస్సార్‌టీఏ నాయకులలతో కలిసి కడపలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. పీఆర్‌సీ కమిషన్‌ను ఏర్పాటులో ఆలసత్వం చేస్తోందన్నారు. సీపీఎస్ రద్దు తోపాటు ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధనకు రోడ్ మ్యాప్ ప్రకటించాలన్నారు. వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి, కార్యదర్శి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌టీఏ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు 6వ తేదీ నిర్వహించే ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఏ అసోసియేట్ కార్యదర్శి ఎస్వీ రమణారెడ్డి, జిల్లా సలహాదారు రమేష్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ మోహిద్దీన్, అన్నమయ్య జిల్ల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, వేంపల్లె అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి ఇబ్రహీం, చక్రాయపేట అధ్యక్షుడు పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి


