తిరుమల ప్రయాణం తికమక! | - | Sakshi
Sakshi News home page

తిరుమల ప్రయాణం తికమక!

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

రాజంపేట: విశాఖ–కడప మధ్య నడిచే తిరుమల (18521/18522)ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణం తికమకగా మారింది. తిరుమల ఎక్స్‌ప్రెస్‌గా గుంతకల్‌ జంక్షన్‌ వరకు పొడిగిస్తూ సౌత్‌సెంట్రల్‌ రైల్వే ఇటీవల ఉత్తర్వులు విడుదలచేసింది. ప్రస్తుతం కడప వరకు నడుస్తున్న ఈ రైలును కడప నుంచి గుంతకల్‌ వరకు ప్యాసింజర్‌గా నడిపించారు. కొంతకాలం కడప వరకు నడిపించి నీటి కోసం కొండాపురం వరకు ఖాళీగా తిప్పారు. మళ్లీ కడప నుంచి గుంతకల్‌ ప్యాసింజర్‌ గా తిప్పారు. ఇలా తిరుమల రైలుపై అనేక ప్రయోగాలు చేశారు. దీంతో ప్రయాణికులు సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారు.

మే 13 నుంచి..

ఎక్స్‌ప్రెస్‌గా గుంతకల్‌ జంక్షన్‌కు నడిపించే విధంగా మే 13 నుంచి పొడిగించేశారు. ఎర్రగుంట్ల, నంద్యాల,గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంకు దగ్గరి మార్గం కడప నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా మారనుంది.

బెర్త్‌లు దొరకాలంటే..

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలులో జిల్లా వాసులకు ప్రయాణం కష్టతరంగా మారింది. కడప నుంచి ఉన్నప్పుడే బెర్త్‌లు లభ్యంకావాలన్నా.జనరల్‌బోగీలో ప్రయాణం చేయాలన్నా ఇబ్బందుల పడాల్సి వచ్చేదని ప్రయాణికులు చెబతున్నారు. ఇప్పుడు గుంతకల్‌ జంక్షన్‌ నుంచి బెర్త్‌లు దొరకడం గురించి చెప్పనక్కర్లేదు. రెండు నెలల ముందు నుంచి రిజర్వేషన్‌ చేసుకుంటే వెయిటింగ్‌లిస్ట్‌ చాంతడంతా ఉంటుంది. తిరుమలలో ప్రయాణం భారమనే భావనలు జిల్లా వాసుల్లో నెలకొన్నాయి.

కడప–గుంతకల్‌ ప్యాసింజర్‌కు మంగళం

ఎక్స్‌ప్రెస్‌గా మళ్లీ గుంతకల్‌కు పొడింపు

Advertisement
 
Advertisement
Advertisement