జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్
నందలూరు: మండలంలోని చెరువుల కబ్జాలను తొలగించాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తహసీల్దార్ శివలక్ష్మీకి సూచించారు. శనివారం జలధార– జలహారతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని లేబాక చెరువును, ఆడపూరు గ్రామ పంచాయతీ మర్రిపల్లెలోని లేబాక చెరువుకు నీరందించే కాలువను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలధార జలభద్రతలో భాగంగా మొదటి విడతలోనే లేబాకచెరువు అభివృద్ధి కోసం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
చేనేత క్లస్టర్ భవనం సందర్శన
సిద్దవటం: మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ ఎస్‌కేఆర్ నగర్‌లో ఉన్న చేనేత క్లస్టర్ భవనాన్ని శనివారం కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సందర్శించారు. ప్యాషన్ డిజైన్లను ఎలా చేయిస్తారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒరిజినల్ మగ్గాలపై క్లాత్ తయారు చేసుకుని డిజైన్ వేయించి ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ డయింగ్ హౌస్‌ను పరిశీలించారు. డయింగ్ హౌస్‌ను మరమ్మతులు చేయించేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో హ్యాండ్‌లూమ్ ఏడీ పిచ్చేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మీ, హౌసింగ్ పీడీ రాజారత్నం, ఏడీఓలు రవిప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.


