తెలుగుపదానికి జన్మదినం..
రాజంపేట: అదివో అల్లదివో అంటూ.. ఆ ఏడుకొండలవాడిపై అద్భుత కీర్తనలు రాసి ఆలపించిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. ఒకటా రెండా 32 వేల సంకీర్తనలు ఆలపించి పదకవితాపితామహుడిగా ఖ్యాతిగాంచిన అన్నమయ్య జన్మదినం నిజంగా తెలుగుపదానికి జన్మదినమే. జానపదానికి జ్ఞానపథమే. అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిచనున్నారు.
ఉత్సవాల వివరాలు
● ఈ నెల 2 నుంచి 8వరకు అన్నమయ్య జయంత్యుత్సవాలు నిర్వహణ
● తాళ్లపాక, అన్నమయ్య 108 విగ్రహం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయి.
● 2న తాళ్లపాకలో అన్నమయ్య ధాన్యమందిరం వద్ద ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం అన్నమయ్య థీంపార్కు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. తాళ్లపాకలో వంశీయులలో ఒకరైన తాళ్లపాక మీన లోచన బృందం చే సంగతీ సభను కూడా నిర్వహిస్తున్నారు.
తాళ్లపాక వంశీయులు వీరే..
తాళ్లపాక నాగభూషణం, తాళ్లపాక కుప్పరాఘవన్, తాళ్లపాక హరినారాయణచార్యులు, శేషధర రవికుమార్, శ్రీరాంకుమార్, రాఘవ అన్నమాచార్యులు. వీరిని శనివారం టీటీడీ అధికారులు సన్మానించనున్నారు.
నేటి నుంచి అన్నమయ్య 618 జయంత్యుత్సవాలు
తాళ్లపాకలోనేడు శ్రీవారి కల్యాణం


