పిడుగు పాటుకు రెండు బర్రెలు మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగు పాటుకు రెండు బర్రెలు మృతి

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించాలి

చక్రాయపేట : మండలంలోని చిలేకాంపల్లె దళితవాడలో గురువారం రాత్రి పిడుగు పడి రెండు బర్రెలు మృతి చెందాయి. వాటి విలువ సుమారు లక్ష పైనే ఉంటుందని బాధితుడు పారి చిన్నబ్బి వాపోయాడు. బర్రెలను చెట్టుకు కట్టేశామని, గాలివానతోపాటు పెద్ద ఎత్తున ఉరుములు రావడంతో తాము భయంతో ఇంటిలోకి వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో రెండు బర్రెలు అక్కడికక్కడే చనిపోయాయని చెప్పాడు. ఈ విషయాన్ని పశువైద్యాధికారితోపాటు రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు బాధిత రైతు తెలిపారు.

మద్యం అక్రమ విక్రయాలపై దాడులు

కడప అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఎస్‌.పి షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఆదేశాల మేరకు మద్యం అక్రమ విక్రయాలపై పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కడప రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సంజన్న సర్కిల్‌ వద్ద దాడులు నిర్వహించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వెంకటసుబ్బారెడ్డి(23) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 47 క్వార్టర్‌ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు రిమ్స్‌ పి.ఎస్‌ సి.ఐ రాజగోపాల్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో రిమ్స్‌ పి.ఎస్‌ ఎస్‌.ఐ చంద్రమోహన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించవచ్చని డీఎస్‌డీవో షేక్‌ గౌస్‌బాషా పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో 2026 వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని క్రీడాకారులు ఈ వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ శ్రీకాంత్‌రెడ్డి, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ జిలానీ బాషా, రాష్ట్ర పీఈటీ అండర్‌ పీడీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ కిరణ్‌, స్టెప్‌ మేనేజర్‌ సుబ్బరాయుడు, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement