పుల్ల ఐస్‌లు అమ్ముతూ.. వడదెబ్బతో మృతి | - | Sakshi
Sakshi News home page

పుల్ల ఐస్‌లు అమ్ముతూ.. వడదెబ్బతో మృతి

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

రాజంపేట : రాజంపేట మండలం చెర్లోపల్లెకు చెందిన పొన్నపల్లి నరసింహులు(53) వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందారు. ఆయన పుల్ల ఐస్‌లు అమ్ముకుంటూ జీవనం సాగించే వారు. ఈ క్రమంలో గురువారం పుల్ల ఐస్‌లు తీసుకొని పెనగలూరు మండలంలో అమ్ముకునేందుకు వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను రాజంపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

వడదెబ్బతో మృతి చెందిన నరసింహులు కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నరసింహులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట రాజంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు చొప్పా ఎల్లారెడ్డి, డీలర్‌ సుబ్బరామిరెడ్డి తదితరులు ఉన్నారు.

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

Advertisement
 
Advertisement
Advertisement