నేడు పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు క్షణికావేశంకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మార్కులు తక్కువ వచ్చినవారిని, ఫెయిల్ అయ్యే విద్యార్థుల ను చిన్నచూపు చూడకూడదు. విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే ప్రపంచ విజేతలుగా నిలుస్తారు.
– షేక్. షంషుద్దీన్, డీఈఓ, వైఎస్సార్‌జిల్లా


