శిక్షణ శిబిరాలు నిర్వహించే ప్రాంతాలు ఇవే
గతంలో కంటే చాలా తక్కువ
కురబలకోట: కురబలకోట మండలంలోని కడప క్రాస్, దిగువబోయపల్లి పరిసర గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన వర్షానికి టమాటా, వరి పంటలు దెబ్బతిన్నాయి. 45 నిమిషాల పాటు పడిన వర్షానికి వడగళ్లు సైతం పడటంతో ఇటీవల కొత్తగా నాటిన టమాటా దెబ్బతింది. కడప క్రాస్‌కు చెందిన ఏవీ లక్ష్మిదేవమ్మకు చెందిన మూడు ఎకరాల టమాటా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇంకా నేలను పట్టుకుని నిలబడక ముందే వడగళ్ల దెబ్బకు విరిగిపోయాయని తెలిపారు. అలాగే పరిసర ప్రాంతాల్లో 70 ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు రైతులు వాపోయారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఆటలకు వేళయింది.. మైదానం సిద్ధమైంది.. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు నెల రోజుల పాటు ఆటల్లో మునిగితేలనున్నారు.. పిల్లల్లో మానసిక ఉల్లాసంతో పాటు వారిలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శాప్ ఆధ్వర్యంలో ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా మే 1 నుంచి 31 వరకు జిల్లాలోని 30 ప్రాంతాల్లో శిక్షణ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శిక్షకులను నియమించారు. శిక్షకుడికి రూ. 2000లు ఇవ్వనుండగా నిర్వహణకు రూ. 1000, రోజుకు రూ. 60 చొప్పున సుమారు రూ. 1800 కేటాయించగా క్రీడా సామాగ్రి మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.3400 వినియోగించనున్నారు. వాస్తవానికి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 60 ప్రాంతాలలో శిబిరాలు నిర్వహించేందుకు ప్రతిపాదించగా 30 ప్రాంతాలలో నిర్వహణకే శాప్ అనుమతులు జారీ చేసింది. వేసవి సెలవుల్లో ఖాళీగా ఉండే విద్యార్థులు వారికి ఇష్టమైన ఆటలాడి నెల రోజులపాటు నైపుణ్యం సాధించవచ్చు.
● 8నుంచి 16 ఏళ్లలోపు బాల బాలికలకు అవకాశం కల్పిస్తారు. అర్చరీ, అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, షటిల్, బ్యాడ్మింటన్ ఫుట్‌బాల్, పెన్సింగ్, హ్యాండ్ బాల్, కరాటే, సాప్ట్‌బాల్, తైక్వాండో వాలీబాల్ రెజ్లింగ్ క్రీడాంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు.
30 శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశాం జిల్లా మొత్తంగా 30 శిబిరాలు ఏర్పాటు చేయనున్నాం. ఈ మేరకు క్రీడా సంఘాలు వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానించాం. –షేక్ గౌస్‌బాషా,
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి
కడప డీఎస్‌ఎ స్టేడియంలో హ్యాండ్‌బాల్, హాకీ, అథ్లెటిక్స్, టెన్నిస్, స్కేటింగ్, తైక్వాండ్, వెయిట్‌లిఫ్లింగ్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, వాలీబాల్, డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, సీఎస్‌ఐ మైదానంలో ఫుట్‌బాల్ శిక్షణ శిబిరాలు కడప నగర వేదికగా జరగనున్నాయి. బద్వేలులో అథ్లెటిక్స్, ప్రొద్దుటూరు అర్బన్‌లో బాస్కెట్‌బాల్, టి. సుండుపల్లిలో హ్యాండ్‌బాల్, సిద్దవటంలో హ్యాండ్‌బా ల్, స్కేటింగ్, పెండ్లిమర్రిలో వాలీబాల్, చాపాడులో పుట్‌బాల్, ముద్దనూరులో హాకీ, ఎర్రగుంట్ల అర్బన్‌లో హాకీ, పుట్‌బాల్, నందలూరులో వాలీబాల్, పులివెందుల అర్బన్‌లో బ్యాడ్మింటన్, హాకీ, రాజంపేట అర్బన్‌లో అథ్లెటిక్స్ వాలీబాల్, లింగాలలో వాలీబాల్ క్రీడాంశాలలో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు.
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గతంలో 50కి పైగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇచ్చేవారు. ఈ ఏడాది కేవలం 30 క్రీడాంశాలల్లోనే శిక్షణ ఇవ్వనున్నారు. అంతే కాకుండా 13 క్రీడాంశాలల్లోనే శిక్షణ ఇస్తూ ఖోఖో, కబడ్డీ వంటి గ్రామీణ క్రీడలకు చోటు కల్పించలేదు.
మే ఒకటి నుంచి జిల్లాలోవేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
ఈ సారి 30 శిబిరాలతోనేసరిపెట్టిన శాప్


