కడప రాయుడి కోనేటి విహారం | - | Sakshi
Sakshi News home page

కడప రాయుడి కోనేటి విహారం

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

కడప రాయుడి కోనేటి విహారం

తెప్పపై

స్వామి వారి విహారం

డప రాయుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుడు పగలంతా దుష్ట శిక్షణతో అలిసి సాయంత్రం కోనేటిలో చల్లగాలితో ఆనందించాలని తెప్పపై కొలువుదీరాడు. అలా...అలా...విహరించి ఆనందించారు. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం తెప్పోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు సాయంత్రం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం చేసి పల్లకిలో కొలువుదీర్చారు. అర్చకులు మయూరం కృష్ణమోహన్‌ బృందం వేదమంత్రోచ్ఛాటనలతో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకు వెళ్లి పుష్కరిణిలో సిద్ధం చేసి ఉన్న తెప్పలో కొలువుదీర్చారు. పూజల అనంతరం మంగళహారతులు ఇచ్చి మొదట వేదమంత్రోచ్ఛాటనలతో తెప్ప పుష్కరిణిలో తొలి ప్రదక్షిణ చేయించారు. రెండవమారు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు గాయకులు భక్తిగీతాలాపనతో తెప్పతో ప్రదక్షిణ నిర్వహించారు. మూడవమారు స్వామి, అమ్మవారు మంగళ వాయిద్యాల మధ్య ప్రదక్షణ చేశారు. మంగళ హారతులు అనంతరం స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు.

–కడప సెవెన్‌రోడ్స్‌

విశేష

అలంకారంలో

స్వామి,

అమ్మవారు

Advertisement
 
Advertisement
Advertisement