రాజంపేట: ప్రతి ఒక్కరూ మోటారు వాహనచట్టం నిబంధనలు పాటించాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాజంపేట మోటారు వెహికల్ కార్యాలయానికి ఎంపీ వెళ్లి, తన లైసెన్స్‌కు సంబంధించి రెన్యూవల్ చేసుకొని, సంబంధిత లైసెన్స్‌ను రాజంపేట ఎంవీఐ వినోద్‌కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, ద్విచక్రవాహనం నడపడటం మంచిదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తోందన్నారు. ప్రధానంగా మైనర్లు వాహనాలను నడపరాదన్నారు. దీనికి తల్లిదండ్రులు బాధ్యులవుతారన్నది గుర్తుంచుకోవాలన్నారు. రాజంపేట ఎంవీఐ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎంవీఐ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న మేడా
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని బుధవారం రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ రంగమండపంలో సేదతీరిన ఆయనను అర్చకులు సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఒంటిమిట్ట రామయ్యను బ్రహ్మోత్సవాల సమయంలో పార్లమెంట్ సమావేశాలు ఉండటం వల్ల దర్శించుకోలేక పోయానన్నారు. ఇప్పటికి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈయన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, మాజీ రాష్ట్ర డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, నందలూరు మండల ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, కో–ఆప్షన్ మెంబర్ రఫీ, ఎంపీటీసీ ముమ్మడి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ మేడా రఘునాథరెడ్డి


