● సెల్‌ఫోన్‌ వద్దే వద్దు.. | - | Sakshi
Sakshi News home page

● సెల్‌ఫోన్‌ వద్దే వద్దు..

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

● సెల్‌ఫోన్‌ వద్దే వద్దు..

చిన్న పిల్లలకు చేతిలోకి సెల్‌ఫోన్‌ వచ్చిందంటే ఒళ్లు, ఇళ్లు మరిచిపోయి ఎన్ని గంటలైనా అలా సమయం గడిపేస్తూ ఉంటారు. పాఠశాలకు సెలవు రోజుల్లో పిల్లలు సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంచాలి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు అల్లరి చేయకూడదనే ఉద్దేశ్యంతో సెల్‌ఫోన్‌ను పిల్లలకు ఇస్తుంటారు. మొదట్లో బాగానే ఉన్నా కొన్ని రోజులకు పిల్లలు ఆ సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారిపోతారనే విష యాన్ని గ్రహించాలి. దీంతోపాటు సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ ఆటలకు, గేమ్‌లకు బానిసయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే సెల్‌ఫోన్‌లకు పిల్లలకు దూరంగా ఉంచాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం సరదాగా గడపాలి.

Advertisement
 
Advertisement
Advertisement