ఇంటర్‌ ఫీజు గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫీజు గడువు పొడిగింపు

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

ఇంటర్‌ ఫీజు గడువు పొడిగింపు వస్త్ర ఎగుమతులకు ప్రోత్సాహం సేవల్లో ఐఎంహెచ్‌దే ప్రథమ స్థానం 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 30న మాక్‌ డ్రిల్‌

కడప ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పబ్లిక్‌ పరీక్షల ఫీజును ఈనెల 30 వరకు పొడిగించినట్లు ఇంటర్‌ విద్యాశాఖాధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ రెండింటిలోనూ ఫెయిల్‌ అయిన విద్యార్థులురూ.1200 చెల్లించాలన్నారు. ఇంప్రూమెంట్‌ రాసే విద్యార్థులు ఒక పేపర్‌కు రూ.160లు చెల్లించాలని పేర్కొన్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: వస్త్ర ఎగుమతులను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం టెక్స్‌టైల్‌ ఎగుమతుల విజన్‌–2030ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని, అందుకు అనుగుణంగా జిల్లా నుంచి వస్త్ర ఎగుమతులకు ప్రోత్సాహం కల్పిస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. మంగళవారం రాష్ట్ర చేనేత జౌళిశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని చేనేత జౌళి ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త యూనిట్లు ప్రారంభించే ఔత్సాహికులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్‌లూమ్స్‌ ఏడీ పిచ్చేశ్వరనాయుడు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాసమూర్తి, పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

కడప అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య సేవల గురించి సమగ్ర సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో కడప జిల్లా కడప రిమ్స్‌ ఆవరణంలోని మానసిక వైద్యశాల అధికారులు సిబ్బంది ప్రథమ స్థానంలో నిలిచారని ఐఎంఎస్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌. వెంకటరాముడు వెల్లడించారు. వైద్య సేవలపై పేషెంట్స్‌ దగ్గర నుంచి సేకరించిన ఈ సర్వేలో కడప మానసిక వైద్యశాల సిబ్బంది సేవలు 81.4 గా నమోదైందని వివరించారు. రాష్ట్రంలో 40 అనుబంధ వైద్య కళాశాలల్లో, సర్వజన వైద్యశాలల్లో సర్వే చేస్తే వాటిల్లో కడపలోని మానసిక వైద్యశాలకు ప్రథమ స్థానం లభించడం అభినందనీయమని.. ఈ సేవలో పాలుపంచుకున్న ఐఎంహెచ్‌ వైద్యులు సిబ్బందికి ఐఎంఎస్‌ సూపరింటెండెంట్‌ కృతజ్ఞతలు తెలిపారు.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: మే 1 నుంచి 31 వరకు జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ గౌస్‌ బాషా పేర్కొ న్నారు. మంగళవారం నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో క్రీడాకారుల తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 క్రీడాంశాలలో 30 శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు క్రీడా యాప్‌ ద్వారా సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. క్రీడాకారులందరూ పాల్గొని ఈ శిక్షణ శిబిరాలను జయప్రదం చేయాలని సూచించా రు. స్టెప్‌ మేనేజర్‌ సుబ్బరాయుడు, ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ శ్రీకాంత్‌ రెడ్డి, కోచ్‌లు పాల్గొన్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: కొప్పర్తి ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ పరిసరాల్లోని అదీప్‌ ల్యాబొరేటరీ యూనిట్‌లో ఈనెల 30న నిర్వహించనున్న ఆఫ్‌–సైట్‌ ఎమర్జెన్సీ మాక్‌ డ్రిల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో వెంకటపతి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్రంలో ఆయిల్‌, కెమికల్‌ ఉత్పత్తి కేంద్రాల్లో విపత్తులను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించే.. ‘ఆఫ్‌–సైట్‌ ఎమర్జెన్సీ మాక్‌ డ్రిల్‌ నిర్వహణ‘పై ఏపీఎస్‌ డీఎంఏ అధికారులు అన్ని జిల్లాల సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్‌ హాలు నుంచి జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో వెంకటపతి, ఇండస్ట్రీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చీఫ్‌ చిన్నారావ్‌ సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. సీఎస్‌ వీసీ ముగిసిన అనంతరం ఇన్‌ఛార్జి డీఆర్వో మాట్లా డుతూ జిల్లా వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల నిర్వహణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. మాక్‌డ్రిల్‌ సమయంలో కొప్పర్తి పరిసర ప్రాంతాల్లో భద్రతా కారణాల రీత్యా కొన్ని పరిమితులు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement