ఎండలతో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎండలతో అప్రమత్తంగా ఉండాలి

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

పిల్లలకు వేసవి సెలవులు కావడంతో ఆటల్లో మునిగి తెలుతూ ఉంటారు. ఆటల సరదాలో పడి ఎండను పట్టించుకోరు. పైగా ఈ ఏడాది ఎండల తీవ్రత చాలా అధికంగా ఉంది. ఇలాంటి తరుణంలో పిల్లలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లలను ఉదయం 9 గంటలకే ఆటలను ముగించుకుని ఇంటికి వచ్చేలా చూడాలి. సాయంత్రం 5 గంటల పైన బయటకు తీసుకెళ్లాలి. అలా చేస్తేనే మంచిది. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యు లను సంప్రదించాలి.

–డాక్టర్‌ అవ్వారు అర్జున్‌కుమార్‌, ప్రముఖ వైద్యులు, రిమ్స్‌, కడప

సెలవులను వృథా చేసుకోవద్దు

విద్యార్థులను వేసవి సెలవులను వృథా చేసుకోవద్దు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో సరదాగా ఆటల్లో శిక్షణ పొందటం, స్పోకన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ తీసుకోవడం వంటివి చేయాలి. ఎండల తీవ్రత తగ్గాక సాయంత్రంగా ఆటపాటలతో ఎంజాయ్‌ చేయాలి. అలాగే సెలవుల్లో పిల్లలను గ్రంథాలయాలకు వెళ్లి పత్రికలు, మ్యాగజైన్స్‌, విజ్ఞాన పుస్తకాలను చదివించే అలవాటు చేయాలి. సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలి.

– షేక్‌ షంషుద్దీన్‌, డీఈఓ, వైఎస్సార్‌జిల్లా

పిల్లలను గమనిస్తుండాలి

ఇంట్లో తెలియకుండా పిల్లలు స్నేహితులతో కలిసి ఈత సరదాతో బావులు,చెరువులు, కుంటలు వంటి ప్రదేశాలకు ఈతకు వెళ్తుంటారు. అక్కడ ఈత కొడుతున్నవారిని చూసి వీళ్లు కూడా ఈత రాకపోయినా సరదగా నీళ్లలోని దిగి ప్రాణాలు మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉంది. వేసవి సెలవుల్లో పిల్లలను భద్రంగా చూసుకోవాలి. –ప్రసాద్‌రెడ్డి, పీడీ

Advertisement
 
Advertisement
Advertisement