ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

సుండుపల్లె: పోలీసులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని డీఐజీ కోయ ప్రవీణ్‌ అన్నారు. మంగళవారం సుండుపల్లె పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుండుపల్లిలో సీఐ కార్యాలయం నూతనంగా ఏర్పాటు కావడంతో ఆయన పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, కేసుల నిర్వహణ, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్‌ పరిసరాల పరిశుభ్రత, శాంతిభద్రతల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. తనిఖీ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించిన డీఐజీ, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి డ్రగ్స్‌ వంటి వాటిపైన విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్‌ వల్ల జరిగే అనర్థాలను తెలియజేస్తే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్‌రామనాథ్‌హెగ్డే, రూరల్‌ సీఐ ఏపీ మస్తాన్‌, ఎస్‌ఐ ఎస్‌కెఎం హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఐజీ కోయ ప్రవీణ్‌

Advertisement
 
Advertisement
Advertisement