ఎన్‌ఆర్‌ఈజీఎస్
రాష్ట్ర డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్
మదనపల్లె: గ్రామీణ ఉపాధిహమీ పథకం ద్వారా గ్రామాల నీటివనరుల పునరుద్ధరణకు సమగ్ర కార్యా చరణ అమలు చేస్తున్నామని, ఇందులో చెరువులు, ఫీడర్, సప్లయ్ ఛానల్స్ పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్‌ఆర్‌ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ వైవికే.షణ్ముఖ్ కుమార్ అన్నారు. మంగళవారం మదనపల్లెలో అన్నమయ్య, కడప జిల్లాల ఎంపీడీఓలు, ఏపీడీలు, ఏటీఓలు, టెక్నికల్ అసిస్టెంట్ల్లకు జలధార–జలహారతి కార్యక్రమంపై అవగాహన, శిక్షణ సదస్సుకు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లోని చెరువులకు అనుసంధానంగా ఉన్న ఫీడర్ ఛానల్స్, సప్లై ఛానల్స్, నీటి ప్రవాహ మార్గా లన్నింటినీ సమగ్రంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగిస్తూ, వాటిపనులను ఉపాధి కూలీలతోనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డ్వామా పీడీలు వెంకటరత్నం, ఆదిశేషారెడ్డి, భూగర్భ జలాల శాఖ ఈఈ సువర్ణ కుమార్ పాల్గొన్నారు.


