రాజంపేట : ఒంటిమిట్ట దళితవాడకు చెందిన హర్షవర్ధన్‌పై దాడి చేసిన కేసులో కట్టా హరికృష్ణ, కట్టా బాలకృష్ణ, పూల కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్డే తెలిపారు. ఎస్‌డీపీఓ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిందితులను అరెస్టును చూపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ముగ్గురు నిందతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిందన్నారు. రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు. రౌడీలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.


