ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు మురతోటి డానియల్‌ ప్రదీప్‌ పేర్కొన్నారు. శనివారం నగర శివార్లలోని జయరాజ్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో నూతన కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మురతోటా డా నియల్‌ ప్రదీప్‌, ఉపాధ్యక్షుడిగా ధామస్‌ జీవన్‌బాబు, సంయుక్త కార్యదర్శులుగా విక్టర్‌ ప్రభుదాస్‌, పోతుల శ్రీనివాసులు, నీలిమతోపాటు పలువురిని ఎన్నుకున్నారు. అలాగే స్పోర్ట్స్‌ కోటా అండ్‌ అథ్లెటిక్‌ కమిటీని ఎన్నుకున్నారు. ఏపీఎఫ్‌ఏ మార్గదర్శకాల ప్రకారం తొలిసారిగా స్పోర్ట్స్‌ కోటా, అథ్లెటిక్‌ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. స్పోర్ట్స్‌ సభ్యులుగా రంగస్వామి, నీరిషక్నా, అథ్లెటిక్స్‌ కమిటీ సభ్యులుగా ముక్తియార్‌, మామిడి సుతుల, రమేశ్వర్‌రెడ్డిని ఎన్నుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement