కడప అర్బన్ : కడప నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం రాయలసీమ రీజియన్ హోమ్ గార్డ్స్ కమాండెంట్ ఎం.మహేష్ కుమార్ హోంగార్డ్స్ పరేడ్‌ను పరిశీంచారు. ఈ సందర్భంగా హోంగార్డుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు. తరువాత దర్బార్‌లో హోంగార్డ్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకమని, విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ శాఖ ప్రతిష్టను పెంచేలా పని చేయాలని అన్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి సమర్థవంతంగా సేవ చేయగలరన్నారు. అనంతరం హోంగార్డులు తమ సమస్యలను కమాండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హోంగార్డ్స్‌కు సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్.పీ బి.రమణయ్య, ఏ.ఆర్ డి.ఎస్.పి పి.నాగేశ్వరరావు, హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, హోంగార్డ్స్ ఇన్‌చార్జి ఆర్‌ఐ శ్రీశైలరెడ్డి, హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.


