చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం నాగలగుట్టపల్లెలో సోమవారం నుంచి సురభి నాటకాల ప్రదర్శనలు ప్రారంభమవుతాయని భానోదయ నాటక మండలి అధ్యక్షుడు ఆర్.నాగబాబు తెలిపారు. నాగలగుట్టపల్లెలోని నాగ చైతన్య విద్యానికేతన్ ఇంగ్లిషు మీడియం స్కూల్‌లో నాటకాల ప్రదర్శన ఉంటుందని చెప్పారు. సోమవారం భక్త ప్రహ్లాద, మంగళవారం పాతాలభైరవి, బుధవారం లవకుశ, గురువారం బాల నాగమ్మ, శుక్రవారం మాయాబజార్‌తో సురభి నాటకాలు ముగుస్తాయని వివరించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజలు తిలకించి తమను ఆశీర్వదించాలని ఆయన కోరారు.


