గ్రామాభివృద్ధిలో పంచాయతీరాజ్‌ కీలకం | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధిలో పంచాయతీరాజ్‌ కీలకం

Apr 25 2026 7:36 AM | Updated on Apr 25 2026 7:36 AM

గ్రామాభివృద్ధిలో పంచాయతీరాజ్‌ కీలకం

కడప సెవెన్‌రోడ్స్‌: గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే అందుకు కీలకం పంచాయతీరాజ్‌శాఖేనని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముత్యాల రామగోవిందరెడ్డి అన్నారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని శుక్రవారం డీపీఆర్‌సీ భవనంలో నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన ఎంపీడీఓలు, ఏఓలు, జెడ్పీ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ దేశంలో 60 శాతం ప్రజలు గ్రామాల్లోనే జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధి పనుల కారణంగా తమ పిల్లలను పోషించుకుంటూ చదివించుకుంటున్నారని తెలిపారు. ఎన్నేళ్లు పనిచేశామన్నది ముఖ్యం కాదని, ప్రజలకు ఏం చేశామని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలన్నారు. తాను పదవిలోకి వచ్చి స్వల్ప కాలమే అయినప్పటికీ రూ. 30 కోట్లతో గ్రామాల్లో వివిధ అభివృద్ది పనులు చేపట్టామన్నారు. అలాగే 150 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం మాట్లాడారు. అనంతరం విఽధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎంపీడీఓలు, ఏఓలకు జెడ్పీ చైర్మన్‌ మెరిట్‌ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement