ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌

Apr 25 2026 7:36 AM | Updated on Apr 25 2026 7:36 AM

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌

ప్రొద్దుటూరు క్రైం: మండల పరిధిలోని ఖాదర్‌బాద్‌ గ్రామంలో ముందు వెళ్తున్న లారీని ఢీ కొన్న ఘటనలో ఎదురుపాడు సురేష్‌ (36) అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు మండలంలోని మూలవారిపల్లె గ్రామానికి చెందిన సురేష్‌ డ్రైవర్‌గా వెళ్తుంటాడు. అతను పల్సర్‌ బైక్‌లో శుక్రవారం సమీపంలోని ప్రొద్దుటూరుకు వెళ్లాడు. పని ముగించుకొని సాయంత్రం కమలాకర్‌ అనే వ్యక్తితో కలిసి గ్రామానికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీ కొనడంతో సురేష్‌ అక్కడిక్కడే మృతి చెందగా కమలాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.

ఒకరు మృతి, మరొకరికి గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement