● సీజన్‌ ముగుస్తున్నా... | - | Sakshi
Sakshi News home page

● సీజన్‌ ముగుస్తున్నా...

Apr 25 2026 7:36 AM | Updated on Apr 25 2026 7:36 AM

● సీజన్‌ ముగుస్తున్నా...

రబీ సీజన్‌ దాదాపు ముగుస్తోంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం రైతుల నుంచి ఒక్క గింజ కూడా వరిధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. అర్భాటంగా జిల్లాలో 30 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. కానీ రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదు. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించక పోవడంతో దళారీలు కొనుగోలులో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు. సాధారణంగా బస్తా 76 కేజీలైతే దళారీలు మాత్రం 78 నుంచి 80 కేజీల వరకు వేసుకుంటున్నారని పలువురు రైతులు తెలిపారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా రైతాంగం వేడుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement