అంగన్వాడీ కార్యకర్తలకు ఇంటర్వ్యూలు | - | Sakshi
Sakshi News home page

అంగన్వాడీ కార్యకర్తలకు ఇంటర్వ్యూలు

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

అంగన్వాడీ కార్యకర్తలకు ఇంటర్వ్యూలు పాలిసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కడప జోన్‌కు ఎలక్ట్రిక్‌ బస్సులు న్యాయమూర్తుల బదిలీ న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలి

కడప సెవెన్‌రోడ్స్‌: కడప, చింతకొమ్మదిన్నె, కమలాపురం సమగ్ర శిశు అభివృద్ధి కార్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులకు గురువారం కడప ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హులైన అభ్యర్థులకు సెలెక్షన్‌ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు జరిగాయి. కార్యక్రమంలో ఆర్డీఓ మురళి, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ సాధికారత అధికారి రమాదేవి పాల్గొన్నారు.

కడప ఎడ్యుకేషన్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించి ఈ నెల 25న నిర్వహించనున్న పాలిసెట్‌–2026కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పాలిసెట్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ సీహెచ్‌ జ్యోతి, నోడల్‌ ఆఫీసర్‌ ఎంవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం నగర శివార్ల లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడా రు. జిల్లాలో పాలిసెట్‌ పరీక్ష నిర్వహణకు 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పాలిసెట్‌ ప్రవేశ పరీక్షను జిల్లావ్యాప్తంగా 10360 మంది విద్యార్థులు రాస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు.

కడప కోటిరెడ్డిసర్కిల్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ కడప జోన్‌కు త్వరలో 500 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ కడప జోనల్‌ చైర్మన్‌ పూల నాగరాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలకు 50 బస్సులు చొప్పున, తిరుపతి జిల్లాకు 350 బస్సులను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. జోన్‌ వ్యాప్తంగా 4196 బస్సులు ఉండగా, సీ్త్ర శక్తి పథకానికి 2852 బస్సులను నడుపుతున్నామన్నారు. ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు 45 ఏళ్లు నిండిన డ్రైవర్లు, కండక్టర్లకు ఏడాదికి రెండుమార్లు మెడికల్‌ పరీక్షలు వచ్చేనెల నుంచి ప్రారంభిస్తున్నామన్నా రు. ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

కడప అర్బన్‌: ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో న్యాయమూర్తులను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. కడపలోని జిల్లా కోర్టులో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఎన్‌. శాంతి కడప మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. శ్రీనివాసులు కడప ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా రానున్నారు. కడప నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న జి. దీనబాబు గుంటూరు మహిళా కోర్టు న్యాయమూర్తిగా, రాయచోటి 5వ అదనపు జిల్లా న్యాయమూర్తి కృష్ణణ్‌ కుట్టి చిత్తూరు జిల్లా తిరుపతి కోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. నెల్లూరు నుంచి న్యాయమూర్తి సుమలత బదిలీపై రాయచోటికి, కడప జిల్లా పొక్సో కోర్టు న్యాయమూర్తి టి. కేశవ అనంతపురం అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. నెల్లూరు జిల్లా మహిళా కోర్టు న్యాయమూర్తి ఎం.ఏ సోమశేఖర్‌ కడప ఫోక్సో కోర్టు న్యాయమూర్తిగా రానున్నారు. ప్రొద్దుటూరులో కొత్తగా ఏర్పాటైన 8వ అదనపు జిల్లా కోర్టుకు పదోన్నతిపై హిందూపురం కోర్టు నుంచి డి. వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు.

కడప అర్బన్‌: ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ గొప్పతనాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయవాదులపైనే ఉంటుందని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ సి. యామిని అన్నారు. భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్‌ ) కడప ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నూతన కడప నగర కమిటీ అధ్యక్షుడు వి. రాజగోపాల్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనురాధ, ప్రధాన కార్యదర్శి నాగ అర్చన, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బాలసుబ్బయ్య, నగర ఆర్గనైజర్‌ కార్యదర్శి రాజశేఖర్‌ ఉపాధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి కార్యదర్శి వేణుగోపాల్‌, బాల య్య తదితరులు గురువారం జిల్లా ప్రధాన న్యా యమూర్తిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని న్యాయవాదులు కాపాడాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement