భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న
ఇన్‌చార్జి డీఆర్వో వెంకటపతి తదితరులు
భగీరథ మహర్షి పట్టుదల, సంకల్పానికి నిలువెత్తు నిదర్శనమని, లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని ఆయన జీవిత సారాంశం తెలుపుతుందని ఇన్‌ఛార్జి డీఆర్‌ఓ వెంకటపతి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత భగీరథ మహర్షి చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
● ధృఢ సంకల్పం, అచంచల భక్తి, నిస్వార్థ త్యాగం ఈ మూడు గుణాల సమ్మేళనం మహర్షి భగీరథ జీవితమని ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. మహర్షి భగీరథ జయంతి సందర్భంగా గురువారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి భగీరథ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
–కడప సెవెన్‌రోడ్స్/కడప అర్బన్


