‘జలధార’ను పకడ్బందీగా చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

‘జలధార’ను పకడ్బందీగా చేపట్టండి

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

కడప సెవెన్‌రోడ్స్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జలధార కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి జలధార అమలు, 22ఏ, రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, స్వచ్ఛ సర్వేక్షన్‌ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల కార్యదర్శులు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్‌ బోర్డు మీటింగ్‌ హాలు నుంచి కలెక్టర్‌, జేసీ, జిల్లా అధికారులు హాజరయ్యారు. వీసీ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జలధార కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఎటువంటి లోపాలు లేకుండా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఇన్‌ఛార్జి డీఆర్వో వెంకటపతి, సీపీఓ హజరతయ్య, మైనర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ అబ్దుస్‌ సమీ, డ్వామా పీడీ అదిశేషారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఏడుకొండలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement
 
Advertisement
Advertisement