హా‘కీ’ కష్టాలు తొలగినట్లే! | - | Sakshi
Sakshi News home page

హా‘కీ’ కష్టాలు తొలగినట్లే!

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

హా‘కీ’ కష్టాలు తొలగినట్లే!

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: కడప నగరంలోని డీఎస్‌ఏ ఆవరణలో నిర్మించిన హాకీ టర్ఫ్‌ పిచ్‌ ను త్వరలో ప్రారంభించనున్నారు. నిర్మాణం పూర్తయినా తాళం వేసి న విషయాన్ని ఈ నెల 20న ‘హా‘కీ’తో ఆటలు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి శాప్‌ అధికారులు స్పందించారు. ఈ విషయమై డీఎస్‌డీఓకు వివరణ అడిగారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ అధికారుల వద్ద ఉన్న సదరు ఫైల్‌ను స్వాధీనం చేసుకున్న డీఎస్‌ఏ అధికారులు శాప్‌కు లెటర్‌ పంపారు. ఈ మేరకు శాప్‌ అధికారులు హాకీ టర్ఫ్‌ పిచ్‌ కోర్టును ప్రారంభించాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా క్రీడాకారులను దృష్టిలో పెట్టుకొని దాదాపు రూ. 8 కోట్లతో ఈ హాకీ టర్ఫ్‌ పిచ్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ టర్ఫ్‌ పిచ్‌ను ప్రారంభం చేయకపోవడంతో క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. త్వరలో ఈ హాకీ టర్ఫ్‌ పిచ్‌ ప్రారంభం కానుండటంతో క్రీడాకారులకు ప్రాక్టిస్‌ సమస్య తీరినట్లే.

Advertisement
 
Advertisement
Advertisement