ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణం వేంపల్లి రోడ్డులోని గానుగ వీధిలో ఉండే దేరంగుల వెంకటజ్యోతి (17) అనే విద్యార్థిని కనిపించడం లేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వనాథరెడ్డి అన్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గానుగ వీధిలో నివాసం ఉండే విశ్వనాథ్‌కు కుమార్తె వెంకటజ్యోతి ఉంది. విశ్వనాథ్ పదేళ్ల కిందటే మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి కూలి పని చేసుకుంటూ కుమార్తెను పోషించింది. వెంకటజ్యోతి కడపలో ఇంటర్ చదువుతోంది. బుధవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టు పక్కల వారిని విచారణ చేసినా ఫలితం లేకపోయింది. ఆ విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


