శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

కడప అర్బన్‌ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో రాజంపేట, పులివెందుల సబ్‌ – డివిజన్ల నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. పగలు, రాత్రి గస్తీ పెంచాలని, విజిబుల్‌ పోలీసింగ్‌ బలోపేతం చేయాలని తెలిపారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్‌ మీడియా కేసులను త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మిస్సింగ్‌ కేసులను ఛేదించాలని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో రాజంపేట ఏఎస్‌పీ మనోజ్‌ రామనాథ్‌ హెగ్డే, పులివెందుల డీఎస్‌పీ మురళి నాయక్‌, రాజంపేట, పులివెందుల సబ్‌ డివిజన్‌లోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement