గ్రామీణ పారిశుధ్యంలో సీఎస్‌సీలు కీలకం | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ పారిశుధ్యంలో సీఎస్‌సీలు కీలకం

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

గ్రామీణ పారిశుధ్యంలో సీఎస్‌సీలు కీలకం

కడప సెవెన్‌రోడ్స్‌: గ్రామీణ పారిశుద్ద్యంలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల పాత్ర కీలకమని జిల్లా పరిషత్‌ సీఈఓ రామచంద్రారెడ్డి అన్నారు. జెడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమాలపై డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు, ఎంపీడీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి స్థలం లేని వారికి ఉపయోగపడటం కోసమే శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఓడీఎఫ్‌ ఫ్లస్‌ లక్ష్యాలను పరిపూర్తి చేయడమే శానిటరీ కాంప్లెక్స్‌ల ఉద్దేశమన్నారు. ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ద్యాన్ని మెరుగు పరిచేందుకు చెత్త సేకరణ వాహనాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎంపీడీఓలు ఉదయాన్నే ఫీల్డ్‌ విజిట్‌కు వెళ్లాలని సూచించారు.డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం మాట్లాడారు. డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అఽధికారులు పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement