కడప ఎడ్యుకేషన్: ఏపీఆర్‌ఎస్ కామన్ అడ్మిషన్ టెస్టు(ఏపీఆర్‌ఎస్ క్యాట్), ఏపీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రెస్టు టెస్టు(ఏపీఆర్‌జేసీ అండ్ డిసీ సిఈటి–2026)ను ఈ నెల 24వ తేదీ నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రవేశ పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్‌లో 2 పరీక్షా కేంద్రాలలో, మధ్యాహ్నం సెషన్‌లో 9 పరీక్షా కేంద్రాలలో ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్సులో కలిసి జిల్లావ్యాప్తంగా 2322 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం సెషన్ 10 గంటల నుంచి 12 గంటల వరకు , మద్యాహ్నం సెషన్ 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు.


