ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో ఈ నెల 26న శ్రీ వాసవీమాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవతో మొదలుకుని విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచనం, సప్తశతీపారాయణం, లోక కల్యా ణార్థం గణపతి, నవగ్రహ, రుద్ర, చండీహోమం, అ మ్మవారికి విశేష అభిషేకాలు, అర్చనలతో పాటు ప్ర త్యేక అలంకరణ ఉంటుందన్నారు. మధ్యాహ్నం భక్తులకు భోజన ప్రసాద వినియోగం ఉంటుందన్నారు. సాయంత్రం 6.30 గంటలకు స్వర్ణ శ్రీచక్రమేరువునకు హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాధీశులు శ్రీ విద్యారణ్యభారతీ స్వామిజీ ఆధ్వర్యంలో 102 మంది ఆర్యవైశ్య సుహాసినులతో శ్రీలలితా సహస్రనామ కుంకుమార్చన నిర్వహించనున్నామన్నారు.


