కమలాపురం : మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కమలాపురం పెద్ద దర్గాగా పిలిచే దర్గా–ఏ–గఫారియా ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన మహా ప్రసాదాన్ని బుధవారం పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ అందజేశారు. ఈనెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కమలాపురం పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు నిర్వహించారు. అలాగే ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులకు షేక్ ఇస్మాయిల్ ప్రపాదాన్ని అందజేశారు. కాగా ఉరుసు ఉత్సవాల నిర్వహణ గురించి మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి, దర్గా కన్వీనర్ ఇస్మాయిల్‌ను అడిగి తెలుసుకున్నారు.


