కల్యాణం... కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం... కమనీయం

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారి మాల దీక్ష భక్తుల ఆధ్వర్యంలో బుధవారం బ్రహ్మంగారిమఠంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గోవిందమాంబ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను స్థానిక మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రి స్వామి, ఈశ్వరీ దేవి మఠం మఠాధిపతి శివ కుమార స్వాములు పర్యవేక్షించారు. బ్రహ్మంగారి ఆరాధన గురు పూజ మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభం కానుండడంతో మండలంలో ఉన్న బ్రహ్మంగారి మాల దీక్ష బృందం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బ్రహ్మంగారిమఠ వేద పండితులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement