నేటి నుంచి వార్షిక పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా 1వతరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సంబంధిత పరీక్షలు నేటి నుంచి అన్ని పాఠశాలల్లో ప్రారంభంకానున్నాయి. ఇందులో భాగంగా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు, 6 నుంచి 8 తరగతి విద్యార్థులకు 6 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు , 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 9.15 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,94,958 మంది విద్యార్థులు ఈ వార్షిక పరీక్షలకు (సమ్మెటివ్ అసెస్‌మెంట్–2)హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కడపలోని జిల్లా కామన్ ఎగ్జామ్ బోర్డు(డీసీఈబీ) నుంచి మండల కేంద్రాలకు చేర్చారు.
● 1 నుంచి 8 తరగతులకు ఎస్‌ఏ–2 పరీక్షలు
● మండల కేంద్రాలకు చేరిన ప్రశ్నపత్రాలు
కడప సెవెన్‌రోడ్స్ : పునరుత్తానంతో తానే జీవమునని క్రీస్తు ఏసు లోకానికి చాటారని మరియాపురం సెయింట్ క్యాథడ్రల్ చర్చి బిషప్ సగినాల పాల్ ప్రకాశ్ అన్నారు. ఆదివారం క్రీస్తు పునరుత్తానం (ఈస్టర్) పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజామునే పెద్ద ఎత్తున విశ్వాసులు చర్చి ఆవరణలోకి తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. ద్వేషం ఉన్నచోట ప్రేమను, అశాంతి ఉన్నచోట సమాధానాన్ని నెలకొల్పి సత్యాన్ని స్థాపించడమే ఈస్టర్ పండుగ అసలైన పరమార్థమని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
ఘనంగా ఈస్టర్ వేడుకలు
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు


