కడప సెవెన్‌రోడ్స్: దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక వివక్షతను జయించిన సామాజిక విప్లవ యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఆయనకు దేశం యావత్తు మమతల నీరాజనాలు అర్పిస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సమతావాది, మానవతావాది, సుపరిపాలనాధ్యక్షుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ 119వ జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునతోపాటు మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లేష్, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి వెంకట సుబ్బయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి హాజరయ్యారు. బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయ స్ఫూర్తితో.. జిల్లాలో సుస్థిర అభివద్ధి కోసం.. అధికారులు పాటుపడాలని డీఆర్‌ఓ సూచించారు. కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి వెంకటసుబ్బయ్య, వివిధ దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రుణాల పంపిణీ: అనంతరం డీఆర్‌డీఏ, ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 53 మంది లబ్ధిదారులకు ఉన్నతి పథకం ద్వారా రూ. 21.20 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ 26.50 లక్షలు, లబ్ధిదారుల వాటా రూ. 5.30 లక్షలు కలిపి మొత్తం రూ. 53 లక్షలు వివిధరకాల జీవనోపాధులకు మంజూరు చేశారు.
డీఆర్వో మల్లికార్జునుడు


