తప్పుడు కేసులు పెడుతున్నారు.. ఎవరినీ వదిలిపెట్టం | - | Sakshi
Sakshi News home page

తప్పుడు కేసులు పెడుతున్నారు.. ఎవరినీ వదిలిపెట్టం

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

కొండాపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులపై రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా తప్పడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న వారిని ఎవరిని వదిలిపెట్టమని జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయ కర్త, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.సోమవారం కొండాపురంలోని రాఘవేంద్ర ఆశ్రమంలో స్టేట్‌ ఆర్గనైజేషన్‌,యాక్టివిటీ సెక్రటరీ వజ్ర భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఈసీ మెంబర్‌ గిరిధర్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్సీ గ్రామ కమిటీ,గ్రామ అనుబంధ విభాగ కమిటీలను నియమించే కార్యక్రమం నిర్వహించారు.

ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్యాయంగా ఏ అధికారి అయినా ఇబ్బందులు పెడితే పార్టీ శ్రేణులు సమష్టిగా, ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా, ఓటు వేయకపోయినా సంక్షేమఫలాలు అందించారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీలు ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేసి వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకుందామని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. వజ్ర భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నియమించిన కమిటీ సభ్యులు ప్రజలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి అందించిన సంక్షేమఫలాలు, కూటమి ప్రభుత్వం అమలు చేయలేని పథకాల గురించి వివరించాలని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల సీనియర్‌నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement