దంతవైద్య కళాశాల పరిపాలనాధికారిగా నాగరాజు | - | Sakshi
Sakshi News home page

దంతవైద్య కళాశాల పరిపాలనాధికారిగా నాగరాజు

Feb 17 2026 7:50 AM | Updated on Feb 17 2026 7:50 AM

దంతవై

దంతవైద్య కళాశాల పరిపాలనాధికారిగా నాగరాజు

కడప అర్బన్‌ : కడప ప్రభుత్వ దంతవైద్య కళాశా ల, హాస్పిటల్‌ పరిపాలనాధికారిగా కె.బి నాగరా జు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప ద్మావతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లుగా ఆఫీస్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న నాగరాజుకు పదోన్నతి కల్పించడంతో పాటు ఇక్కడే పరిపాలనాధికారిగా నియమించడంతో సహచర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

హుండీ ఆదాయం లెక్కింపు

సిద్దవటం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భా గంగా శ్రీ నిత్యపూజ స్వామి హుండీలో భక్తులు వేసిన కానుకలు లెక్కింపు చేపట్టగా రూ.14,96, 073 ఆదాయం వచ్చిందని ఎండోమెంట్‌ ఇన్‌చార్జ్‌ ఈఓ శ్రీధర్‌ తెలిపారు. సిద్దవటం మండలంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీనిత్యపూజస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజుల పాటు భక్తులు వేసిన కానుకలు లెక్కించామని పేర్కొన్నారు. ఆలయ ఛైర్మన్‌ రాజేంద్రప్రసాద్‌, పీఎఫ్‌ఓ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏఆర్‌ పోలీసులు, సిద్దవటం పోలీసులు పాల్గొన్నారు.

ఉత్సవాల ఆదాయం రూ.7.60 లక్షలు

చాపాడు : మండలంలోని అల్లాడుపల్లె వీరభధ్రస్వామికి మహాశివరాత్రి ఉత్సవాల ద్వారా 7.60 లక్షలుపైగా ఆదాయం లభించినట్లు ఆలయ చైర్మన్‌ వీరనారాయణ యాదవ్‌, ఈఓ శంకర్‌ బాలాజీ తెలిపారు. శివరాత్రి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన 3 తాత్కాలిక హుండీల ద్వారా ఆదాయం రూ.2.90 లక్షలు రాగా, స్పెషల్‌ దర్శనం రూ.10 టికెట్‌ ద్వారా రూ.62,250, ప్రత్యేక దర్శనం రూ.100 టికెట్‌ ద్వారా రూ.87,700 ఆదాయం వచ్చిందని వారు వివరించారు. భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా రూ.20,160, ఖాళీ స్థలాలు (అంగళ్లు) ద్వారా రూ.44,410, సేవా టికెట్ల వల్ల రూ.2,60,182, లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా రూ.1,52,000లు, అన్నదాన సత్రం వద్ద భక్తుల ద్వారా రూ.57,549లు ఆదాయం వచ్చిందన్నారు. లక్కిరెడ్డిపల్లె గంగమ్మ తల్లి దేవస్థాన ఈఓ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఫొటో:

16ఎంవైడి 02– హుండీలలో నగదు లెక్కింపు చేపడుతున్న సిబ్బంది

దంతవైద్య కళాశాల  పరిపాలనాధికారిగా నాగరాజు 1
1/1

దంతవైద్య కళాశాల పరిపాలనాధికారిగా నాగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement