ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం | - | Sakshi
Sakshi News home page

ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం

Feb 17 2026 7:50 AM | Updated on Feb 17 2026 7:50 AM

ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం

ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం

కడప సెవెన్‌రోడ్స్‌ : నులిపురుగులను నులిమేస్తేనే.. సమాజానికి ఆరోగ్యకరమైన భావిభారత పౌరులను అందివ్వగలమని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్‌ హాల్‌లో ఈనెల 17న నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై జేసీ డాక్టర్‌ నిధి మీనా, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ భావన, డీఎంహెచ్‌ఓ నాగరాజులతో కలిసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. అందులో భాగంగా.. నులిపురుగులను నివారించేందుకు ఆల్బెండజోల్‌ మాత్రలను అన్ని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేయనున్నామని పేర్కొన్నారు. అనంతరం నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై.. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వారు ప్రచురించిన వాల్‌పోస్టర్లను సంబందిత జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు.

కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement